ఎల్లప్పుడూ అనిశ్చితి, గందరగోళం నెలకొన్న ఈ ప్రపంచంలో, “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది” (కీర్తనలు 119:105) అని పలికిన కీర్తనాకారునికి ఉన్న నిశ్చయతను కనుగొనండి. మా అనుదిన ఆహారం 2027 వార్షిక సంచికలో, మీరు ప్రతిరోజూ దేవుని వాక్యపు వెలుగులో నడుచుకునేలా, లేఖన భాగాలతో కూడిన 365 సంక్షిప్త ధ్యానాలు, ఉజ్జీవింపజేసే సందేశాలు పొందుపరచబడ్డాయి. మీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా, ముందుకు సాగడానికి మార్గం కనుగొనడం ఎంత కష్టంగా ఉన్నప్పటికీ, “చీకటిని వెలుగుగా చేయు” (కీర్తనలు 18:28) మన ప్రభువుతో ముందుకు సాగిపోదాము.